Ad Code

మన సంబంధం విశ్వాసం అనే పునాదిపై నిర్మించబడింది !


భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒమన్‌లో భాగంగా మస్కట్‌లో భారత్-ఒమన్ వ్యాపార సదస్సులో ప్రసంగిస్తూ  ''మన సంబంధం విశ్వాసం అనే పునాదిపై నిర్మించబడింది. స్నేహం అనే బలంపై ముందుకు సాగింది. కాలక్రమేణా అది మరింత బలపడింది. నేడు మన దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇది కేవలం 70 సంవత్సరాల వేడుక మాత్రమే కాదు. ఇది ఒక మైలురాయి. మన శతాబ్దాల వారసత్వాన్ని ఒక సుసంపన్నమైన భవిష్యత్తు వైపు తీసుకువెళ్లాలి.'' అని ఆకాంక్షించారు. సముద్రం రెండు చివర్లు చాలా దూరంలో ఉంటాయని, అయితే అరేబియా సముద్రం మాండవి, మస్కట్‌ల మధ్య ఒక బలమైన వారధిగా నిలిచింది. ఈ వారధి మన సంబంధాలను, సంస్కృతిని, ఆర్థిక వ్యవవస్థను బలోపేతం చేసిందని ఈరోజు పూర్తి విశ్వాసంతో చెప్పగలం. సముద్రపు అలలు, వాతావరణం మారినప్పటికీ భారతదేశం-ఒమన్ మధ్య స్నేహం ప్రతి అలతో పాటు మరింత బలపడుతోందని అన్నారు. బుధవారం ఒమన్‌ చేరుకోగానే ఉప ప్రధాని సయ్యిబ్‌ షిహాబ్‌ బిన్‌ తారిక్‌ అల్‌ సయిద్‌తో మోడీ సమావేశమై పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య ఉన్న మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా సమాలోచనలు జరిపారు. భారత్‌-ఒమన్‌ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లవుతుండటాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఓ ఎగ్జిబిషన్‌ను మోడీ తిలకించారు.

Post a Comment

0 Comments

Close Menu