Ad Code

లింగంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం


హైదరాబాద్ లోని లింగంపల్లిలో ఇవాళ నిర్మాణ సంస్థకు చెందిన కూలీలు ఏర్పాటు చేసుకున్న షెడ్‌లలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటనను గమనించిన వెంటనే స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందజేశారు. సమాచారం అందగానే ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు సహాయక చర్యలు చేపట్టి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో కూలీలు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు స్థానికులను ఘటన స్థలం నుంచి దూరంగా పంపించి వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu