Ad Code

కారును ఢీకొట్టిన చిన్న విమానం : సోషల్ మీడియాలో వీడియో వైరల్


మెరికాలోని ఫ్లోరిడాలో ఓ చిన్న విమానం బీభత్సం సృష్టించింది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం రాత్రి బ్రెవర్ట్ కౌంటీ వద్ద ఇంటర్ స్టేట్ -95 జాతీయ రహదారిపై వేగంగా ప్రయాణిస్తున్న కారును విమానం ఢీకొట్టింది. ఈ హఠాత్తు పరిణామంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. అయితే, ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్, ప్రయాణికుడు ఉన్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వీరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కారు వెనుకాలే వస్తున్న ఓ కారుకు అమర్చిన కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

Post a Comment

0 Comments

Close Menu