Ad Code

గూగుల్ పే తొలి క్రెడిట్ కార్డ్ విడుదల


దేశంలో తొలిసారి గూగుల్ క్రెడిట్ కార్డ్‌ను విడుదల చేసింది. ఈ కార్డ్ రూపే నెట్‌వర్క్‌పై వస్తోంది. యాక్సిస్ బ్యాంక్‌తో కలిసి గూగుల్ పే ఈ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ను తీసుకొచ్చింది. ఈ కార్డ్‌ను యూజర్లు తమ యూపీఐ ఖాతాతో లింక్ చేసుకుని దుకాణాల్లో చెల్లింపులు చేయవచ్చు. యూపీఐ చెల్లింపుల యాప్‌గా ప్రసిద్ధి చెందిన గూగుల్ పే ఈ కొత్త క్రెడిట్ కార్డ్ ద్వారా ప్రత్యేక అనుభవం ఇస్తోంది. సాధారణంగా క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్స్ నెల చివరలో వస్తాయి. కానీ ఈ కార్డ్‌లో ప్రతి లావాదేవీ వెంటనే క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్ వస్తుంది. గూగుల్ సీనియర్ డైరెక్టర్, ప్రొడక్ట్ మేనేజర్ శరత్ బులుసు మాట్లాడుతూ ప్రతి ట్రాన్సాక్షన్‌కి రివార్డ్ వెంటనే వస్తుంది అని చెప్పారు. వచ్చిన రివార్డ్‌ను తదుపరి చెల్లింపులో వెంటనే ఉపయోగించుకోవచ్చని వివరించారు. రూపే-యూపీఐ విధానం వేగంగా ప్రజాదరణ పొందుతోంది. యూపీఐ సౌలభ్యం, క్రెడిట్ కార్డ్ క్రెడిట్ అవకాశం, రివార్డ్స్ అన్నీ ఒకేచోట లభించడం దీనికి కారణం. మాస్టర్‌కార్డ్, వీసా క్రెడిట్ కార్డులను యూపీఐతో లింక్ చేయలేరు. రూపే, యూపీఐ రెండింటినీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. యూపీఐ వల్లే ఈ రివార్డ్ సిస్టమ్ ఇన్నోవేషన్ సాధ్యమైంది అని శరత్ బులుసు చెప్పారు. తదుపరి చెల్లింపుకే రివార్డ్ ఉపయోగించే అవకాశం గూగుల్ పేకు వచ్చింది అని అన్నారు. గూగుల్ పే రూపే క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అనేక ప్రత్యేక ఫీచర్లు, లాభాలు ఇస్తుంది. ప్రతి సరైన లావాదేవీపై స్టార్‌లు సంపాదించవచ్చు, ఒక్కో స్టార్ రూ.1 కి సమానం. ప్రతి రూ.500 ఖర్చుపెట్టి 1 స్టార్ పొందవచ్చు. అదనంగా, రివార్డ్ పీరియడ్‌లో రూ.15,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే 2X నుండి ప్రారంభించి 4X వరకు అంటే ప్రతి రూ.500కి 4 స్టార్స్ రివార్డ్స్‌గా పొందవచ్చు. వెల్కమ్ బెనిఫిట్‌గా మొదటి రివార్డ్ సైకిల్‌లో రూ.500 ఖర్చుపెట్టి 2 స్టార్‌లు పొందవచ్చు. గూగుల్ పే యాప్‌లో రూ.250 గిఫ్ట్ కార్డ్, 250 స్టార్‌లు కూడా అందుతాయి. డైనింగ్ కోసం కూడా ప్రత్యేక లాభం ఉంది. ఈజీడైనర్ ద్వారా డైనింగ్‌లో నెలకు రూ.500 వరకు 15% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. రూ.2,500 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలను ఈజీ ఈఎంఐలో మార్చుకోవచ్చు. తద్వారా పెద్ద చెల్లింపులు సులభతరం అవుతాయి.

Post a Comment

0 Comments

Close Menu