అలనాటి స్టార్ హీరోయిన్ ఆమనిని ఇవాళ హైదరాబాద్ లోని నాంపల్లి, బీజేపీ స్టేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ సభ్యత్వం అందజేశారు. ఆమని బాటలో మరికొంత మంది స్టార్ యాక్టర్స్ బీజేపీలో చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీజేపీ ఇదే తరహా సినీ గ్లామర్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. జయసుధ, విజయశాంతి, జీవిత రాజశేఖర్‍తో పాటు మరికొంత మంది కాషాయదళంలో చేరారు. వీరితో పాటు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి సెలబ్రెటిల ఇంటికి నేరుగా బీజేపీ అగ్రనేతలు వెళ్లడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి విజేయేంద్రప్రసాద్‍ను ఏకంగా రాజ్యసభకు పంపింది. ఇలా పలువురు సినీ తారలను, సినీ రంగ ప్రముఖులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీలో పాజిటివ్ వైబ్ తెప్పించే ప్రయత్నం చేసింది. అయితే వీరిలో విజయశాంతి బీజేపీ నుంచి కాంగ్రెస్‍లో చేరి ఎమ్మెల్సీ చాన్స్ కొట్టేశారు.
0 Comments