తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్నవారిలోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 9ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. చండ్రుగొండ నుంచి సత్తుపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది.
0 Comments