జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో బుధవారం భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్)కు చెందిన భూగర్భ గని నుంచి విష వాయువైన కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయ్యింది. కెందువాడి బస్తీలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు మహిళలు మరణించినట్లు తెలుస్తున్నది. దీంతో ధన్‌బాద్-రాంచీ రహదారిని ఆ ప్రాంతవాసులు దిగ్బంధించారు. రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు. మరోవైపు భూగర్భ గని నుంచి విష వాయువు కార్బన్ మోనాక్సైడ్ లీక్ కావడంపై బీసీసీఎల్ కంపెనీ స్పందించింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోనేందుకు మూడు అంబులెన్స్‌లను అక్కడ సిద్ధంగా ఉంచింది. ఆ ప్రాంతవాసులు అక్కడి నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించింది. ప్రజలు వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని కోరుతూ వారి ఇళ్ల గోడలకు ఆ కంపెనీ నోటీసులు అంటించింది. నివాసితులను సురక్షితమైన ప్రదేశాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ ఏరియా మేనేజర్ తెలిపారు.
0 Comments