తెలంగాణ పోలీసులకు హ్యాకింగ్ ముఠాలు షాకిచ్చాయి. ఇటీవలే హైకోర్టు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన ఈ ముఠాలు తాజాగా సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్‌లను కూడా టార్గెట్ చేశాయి. దీనివల్ల గత పది రోజులుగా ఈ వెబ్‌సైట్‌లు పూర్తిగా పనిచేయకుండా పోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వెబ్‌సైట్‌లలోని లింకులు ఓపెన్ చేస్తే, అధికారిక సమాచారానికి బదులుగా బెట్టింగ్ సైట్‌లకు రీడైరెక్ట్ అవుతున్నాయని పలువురు గమనించడంతో విషయం తీవ్రతరం అయింది. వెంటనే IT విభాగం ఈ రెండు సైట్‌లను డౌన్ చేసి సర్వర్లు సురక్షితంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌ల నిర్వహణ బాధ్యతలు చూసే నేషనల్ ఇన్ఫోర్మాటిక్స్ సెంటర్ అలర్ట్ అయ్యింది. హ్యాకింగ్‌కు కారణమైన ముఠాలను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులతో సమన్వయం చేస్తూ సర్వర్‌ల భద్రతను బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది.
0 Comments