Ad Code

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రాబిన్ స్మిత్ మృతి


ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రాబిన్ స్మిత్ (62) ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను రాబిన్ స్మిత్‌తో హాంప్‌షైర్ తరఫున ఆడిన మాజీ ఆటగాడు కెవన్ జేమ్స్ బీబీసీ రేడియో సోలెంట్ ద్వారా వెల్లడించారు. రాబిన్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో పేస్ బౌలింగ్‌ను ధైర్యంగా ఎదుర్కొనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. రాబిన్ స్మిత్ 1988 నుంచి 1996 మధ్య ఇంగ్లండ్ తరఫున 62 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. రాబిన్ స్మిత్ టెస్టుల్లో 43.67 సగటుతో 4236 పరుగులు చేశారు. టెస్టుల్లో ఆయన 9 శతకాలను బాదారు. ఆయన 1994లో వెస్టిండీస్‌పై 175 పరుగుల అత్యధిక స్కోరును నమోదు చేశారు. వన్డే క్రికెట్లో 71 వన్డే మ్యాచ్‌లు ఆడి 39.01 సగటుతో 2419 పరుగులు చేశారు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. 1993లో ఆస్ట్రేలియాపై చేసిన 167 నాటౌట్ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. హాంప్‌షైర్ తరఫున తన మొత్తం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన స్మిత్.. 426 మ్యాచ్‌లలో 61 సెంచరీలతో సహా 26,155 పరుగులు చేశారు. ఆయన వేగవంతమైన బౌలింగ్‌ను ధైర్యంగా ఎదుర్కొనేవాడని, ముఖ్యంగా వెస్టిండీస్ పేసర్ల ముందు నిలబడి ధీటుగా సమాధానం చెప్పిన అతికొద్ది మంది ఇంగ్లండ్ బ్యాటర్లలో ఆయన ఒకరని మాజీ సహచరుడు కెవన్ జేమ్స్ కొనియాడారు.


Post a Comment

0 Comments

Close Menu