టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నమెంట్ అధికారిక ప్రసారకర్త బాధ్యతల నుంచి వైదొలగుతామని ఐసీసీకి జియోహాట్‌స్టార్ తెలిపినట్లు సమాచారం. అంతేకాక నాలుగేళ్లలో భారత మీడియా హక్కుల ఒప్పందంలోని మిగిలిన రెండేళ్ల కాంట్రాక్ట్‌ను కూడా కొనసాగించలేమని తెలియజేసినట్లు వార్తలొస్తున్నాయి. జియో హాట్‌స్టార్ ఉన్న పళంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్‌కు వస్తున్న భారీ ఆర్థిక నష్టాలే కారణమని పలువురు మార్కె్ట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇది ఇలా ఉంటే 2026-29 మధ్య కాలానికి భారత మీడియా హక్కుల విక్రయ ప్రక్రియను ఐసీసీ తాజాగా ప్రారంభించింది. ఈ హక్కుల విలువ దాదాపు 2.4 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. మరోవైపు, జియోహాట్‌స్టార్ 2024-27 మధ్య కాలానికి 3 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జియో హాట్‌స్టార్ ప్రసార హక్కుల నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడం అందిని ఆశ్చర్యానికి గురి చేసింది. జియో హాట్ స్టార్ నిర్ణయంతో వరల్డ్ కప్ ప్రసార హక్కులకు సంబంధించి బిడ్‌లు వేయాలని పలు ప్రధాన ఓటీటీ ప్లాట్ ఫామ్‌లకు ఐసీసీ ఆహ్వానాలు పంపిందని సమాచారం. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా, నెట్‌ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి సంస్థలను సంప్రదించినట్లు తెలుస్తోంది.
0 Comments