Ad Code

బరువు తగ్గించే బెండకాయ నీరు ?


బెండకాయ నీరు తాగడం వల్ల బరువు తగ్గవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. నిజానికి బెండకాయ తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి లభిస్తుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుందని, ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుందని అంటున్నారు. బెండకాయ తినడం లేదా దాని నీరు తాగడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపించడం, తరచుగా చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుందని వివరించారు. అలాగే బెండకాయ నీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయని, దాని నీరు తాగడం వల్ల ఆకలి తగ్గుతుందని వెల్లడించారు. ఇది అతిగా తినడాన్ని తగ్గించడానికి, బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ నీరు బరువు తగ్గడానికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, అది అందరికీ మంచిది కాదని చెబుతున్నారు. కడుపు సమస్యలు లేదా అజీర్ణంతో బాధపడుతున్న వారు బెండకాయ తినడం లేదా దాని నీరు తాగడం మానుకోవాలని సూచించారు. యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్న వారు, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు కూడా బెండకాయను ఏ రూపంలోనూ తినకూడదని చెప్పారు. ఇది చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది కాబట్టి, బెండకాయ నీరు తక్కువ చక్కెర స్థాయిలు ఉన్నవారికి కూడా మంచిది కాదని వివరించారు. 

Post a Comment

0 Comments

Close Menu