Ad Code

సూరత్‌లో టెక్స్‌టైల్ షాపులో భారీ అగ్నిప్రమాదం


గుజరాత్‌లోని సూరత్‌లో ఏడంతస్తుల టెక్స్‌టైల్ భవంతులో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేస్తున్నట్లు సూరత్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పారిక్ తెలిపారు. సుమారు 20 నుంచి 22 అగ్నిమాపక యంత్రాలు మంటలు ఆర్పుతున్నట్లు వెల్లడించారు. మంటలు అదుపులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం గిడ్డంగి పనులు జరుగుతున్నాయని.. అలాగే లోపల చాలా సామాగ్రి ఉందని తెలిపారు. 100-125 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నట్లు వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu