దేశంలోని హైవే నెట్‌వర్క్‌లో ప్రయాణం సురక్షితంగా మార్చే లక్ష్యంతో కొత్త మొబైల్ ఆధారిత భద్రతా హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రిలయన్స్ జియోతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఎంవోయూ ప్రకారం ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలు, పొగమంచు, రోడ్లపైకి పశువులు, సడెన్ డైవర్షన్స్ వంటి ప్రమాదకర ప్రాంతాల సమాచారం ఇకపై నేరుగా మొబైల్‌కు పంపనున్నారు. ఈ వ్యవస్థతో కొత్తగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. మొత్తం వ్యవస్థ జియో ప్రస్తుత 4జీ, 5జీ టెలికాం ఫెసిలిటీపై ఆధారపడి నడుస్తుంది. ప్రయాణికులు ఎస్‌ఎంఎస్, వాట్సాప్, హై ప్రయారిటీ కాల్స్ ద్వారా ముందస్తు హెచ్చరికలు స్వీకరిస్తారు. దాంతో ప్రయాణికులు తమ వాహనాల వేగాన్ని తగ్గించడంతో పాటు ప్రమాదకరమైన ప్రాంతాల్లో జాగ్రత్తగా నడిపేందుకు అవకాశం ఉంటుంది. ఈ సర్వీస్‌ని క్రమంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్, హైవేయాత్ర యాప్, నేషనల్ హైవే ఎమర్జెన్సీ నంబర్ 1033తో అనుసంధానిస్తారు. ఈ ఆటోమేటిక్ అలర్ట్ సిస్టమ్ తొలి దశ ఎంపిక చేసిన ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్నది. ఈ ట్రయల్స్ ప్రమాద ప్రదేశాలను గుర్తించడంతో పాటు వారికి ఎలాంటి హెచ్చరికలు పంపాలో నిర్ణయిస్తారు. ఆ తర్వాత జాతీయ రహదారి నెట్‌వర్క్‌కు విస్తరిస్తారు. ఇప్పటికే ఉన్న అన్ని నిబంధనలు, డేటా ప్రొటెక్షన్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఉంటుందని హైవేస్ అథారిటీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇతర టెలికాం కంపెనీలు కూడా ఈ వ్యవస్థలో చేర్చనున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ, జియో మధ్య ఈ ఎంవోయూ జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సురక్షితంగా మార్చే దిశగా కీలకమైన ముందడుగని, ఇకపై ఎలాంటి అదనపు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేకుండానే ఆయా రోడ్లపై డ్రైవర్లు రియల్ టైమ్ ద్వారా హెచ్చరికలను అందుకోనున్నారు. దాంతో ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు.
0 Comments