Ad Code

పెళ్లిళ్లు చేసుకోమని యువతకు సలహాలు ఇవ్వను : జయా బచ్చన్


ముంబయిలో జరిగిన 'వీ ది ఉమెన్' అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జయా బచ్చన్ నేటి యువతరం, పెళ్లి అనే విషయాలపై మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పెళ్లి అనేది ముగిసిన అధ్యాయంలా కనిపిస్తోందని, ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేసుకోమని తాను మాత్రం యువతకు సలహాలు ఇవ్వనని జయా బచ్చన్ వెల్లడించింది . తన మనవరాలు నవ్య నవేలి నందాను వివాహం చేసుకోవాలని చెప్పనని పేర్కొంది. 'నా మనవరాలు నవ్య అప్పుడే వివాహం చేసుకోవడం నాకిష్టం లేదు. పెళ్లి చేసుకోమని నేను సలహా కూడా ఇవ్వను. ఎందుకంటేఈరోజుల్లో పెళ్లి అనేది ముగిసినఅధ్యాయం. నవ్యకు మరికొన్నిరోజుల్లో 28 ఏళ్లు నిండుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల్ని ఎలాపెంచాలో యువతులకు సలహాలు ఇచ్చే పెద్దదాన్ని కాదు. ఈతరం చిన్న పిల్లలు చాలా తెలివైనవారు. వారు మిమ్మల్ని మించిపోతారు. ఈరోజుల్లో వివాహం, చట్టబద్ధత అనే రిలేషన్ నిర్వచించాల్సిన అవసరం లేదు.

Post a Comment

0 Comments

Close Menu