ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు తగిన ఆధారాలు లేవు !


తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి, ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిరాకరించారు. సదరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు తగిన ఆధారాలు లభించలేదని ఈ సందర్భంగా స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, టి. ప్రకాష్ గౌడ్‌లకు ఉపశమనం లభించింది. వీరు కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. బీఆర్ఎస్ నాయకులు వీడియోలు, డాక్యుమెంటరీ ఆధారాలు సమర్పించినప్పటికీ, సాంకేతికంగా ఫిరాయింపు రుజువు కాలేదని తేల్చడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. వీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసం చర్చలు జరిపినట్టు వాదించగా, బీఆర్ఎస్ నాయకులు వీడియో, డాక్యుమెంటరీ ఆధారాలు సమర్పించారు. అయినప్పటికీ, ఫిరాయింపు రుజువు కాలేదని స్పీకర్ తేల్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత, పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీఆర్ఎస్ నాయకులు స్పీకర్‌కు పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఒత్తిడితో విచారణ జరిగింది. మిగతా పిటిషన్లపై నిర్ణయం త్వరలో రానుంది. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org