Ad Code

దక్షిణాఫ్రికాలో కుప్పకూలిన నిర్మాణంలో వున్న అహోబిలం ఆలయం : ముగ్గురు మృతి, మరికొందరు కార్మికులకు గాయాలు


క్షిణాఫ్రికాలోని క్వాజులు నాటల్‌ ప్రావిన్స్‌లోని కొత్తగా నిర్మిస్తున్న నాలుగు అంతస్తుల అహోబిలం ఆలయంలో కార్మికులు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న భారత సంతతికి చెందిన 52 ఏళ్ల వ్యక్తితో సహా మరో ముగ్గురు మృతి చెందగా, మరికొందరు కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న గాయపడిన వారికి చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అలాగే శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అయితే శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu