తమిళనాడులోని సేలం జిల్లాలో తన భూమిలో రోడ్డు నిర్మాణంపై ఒక వృద్ధురాలు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఆగ్రహించి ఆ వృద్ధురాలి చెంపపై కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కామెనేరి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఒక వృద్ధురాలి ఇంటి సమీపంలో రోడ్డు వేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై ఆమె నిరసన వ్యక్తం చేసింది. తన భూమిలో కాకుండా ప్రభుత్వ భూమిలో రోడ్డు వేయాలని ఆమె పట్టుబట్టింది. కాగా, అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే అర్జునన్, ఆ వృద్ధురాలి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఆగ్రహించాడు. ఆ మహిళ చెంపపై రెండుసార్లు కొట్టాడు. ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా కర్రతో కొట్టాడు. గాయపడిన ఆ వృద్ధురాలిని ఓమలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె కోలుకున్న తర్వాత అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే అర్జునన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ వృద్ధురాలిపై ఆయన దాడి చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
0 Comments