Ad Code

ఒకే టెస్ట్‌ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్‌ జోడీగా డెవాన్‌ కాన్వే, టామ్‌ లాథమ్‌


వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ ఓపెనర్లు డెవాన్‌ కాన్వే, టామ్‌ లాథమ్‌ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒకే టెస్ట్‌ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్‌ జోడీగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. టెస్ట్‌ క్రికెట్‌లోనే కాదు, యావత్‌ ఫస్ట్‌క్లాస్‌ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్‌ జోడీగా కాన్వే, లాథమ్‌ చరిత్ర సృష్టించారు. ఈ మ్యాచ్‌లో లాథమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 137, రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేయగా, కాన్వే తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ (227), రెండో ఇన్నింగ్స్‌లో 100 పరుగులు చేశాడు. వ్యక్తిగతంగా కాన్వే మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే టెస్ట్‌ మ్యాచ్‌లో ద్విశతకం, శతకం సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచవాప్తంగా ఈ ఫీట్‌ను మరో తొమ్మిది మంది మాత్రమే సాధించారు.

Post a Comment

0 Comments

Close Menu