Ad Code

తమిళనాడులో బస్సు నుంచి జారిపడి మహిళ మృతి : వీడియో నెట్టింట వైరల్


మిళనాడు దిండుక్కల్‌‍లో బస్సు నుంచి కిందపడిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విఎస్ కోట్టై ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల అమరావతి తన కుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి ఓ ప్రైవేట్ బస్సులో వస్తుండగా కనవాయ్ పట్టి సమీపంలో కండెక్టర్ ఇచ్చిన టికెట్‌ను చేతిలోకి తీసుకునే క్రమంలో మహిళ కిందపడి ప్రాణాలు కోల్పోయింది. బస్సు మెట్లకు దగ్గర నిల్చుండటంతో పాటు కండక్టర్ ఇచ్చిన టిక్కెట్టును తీసుకునే క్రమంలో కమ్మీని పట్టుకోకపోవడం వల్లే ఆ మహిళ అదుపుతప్పి బస్సు నుంచి బయట పడింది. దీంతో తీవ్రగాయాల పాలైన మహిళ ప్రాణాలు కోల్పోయింది.

Post a Comment

0 Comments

Close Menu