Ad Code

ఆత్మహత్యకు పాల్పడ్డ నాలుగో తరగతి విద్యార్థి!


హైదరాబాద్ ‎లోని చందానగర్ ‎లో నాలుగో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలో తల్లిదండ్రులతో కలిసి ప్రశాంత్ (9) అనే బాలుడు నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. అయితే ఏమైందో తెలియదు కానీ మంగళవారం ఇంట్లోని బాత్రూంలో స్కూల్ ఐడీ కార్డ్ ట్యాగ్‎తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‎కు తరలించారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతికి గల కారణాలను అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. నాలుగో తరగతి చదువుతోన్న బాలుడు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Post a Comment

0 Comments

Close Menu