ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో డిసెంబర్ 24న మాగ్నెటో మాల్‌లో క్రిస్మస్ థీమ్‌తో అలంకరణ చేశారు. అయితే 80 మందికిపైగా వ్యక్తులు ఆ మాల్‌లోకి ప్రవేశించారు. క్రిస్మస్ డెకరేషన్‌ను కర్రలతో ధ్వంసం చేశారు. మాల్ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అక్రమ మతమార్పిడులను నిరసిస్తూ హిందూ సంఘాలు బుధవారం 'ఛత్తీస్‌గఢ్ బంద్'కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో కొందరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మాల్‌లోని క్రిస్మస్ డెకరేషన్‌ను ఒక గుంపు ధ్వంసం చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
0 Comments