హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు గన్‌మ్యాన్‌గా పనిచేస్తున్న చైతన్య ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన హయత్‌నగర్‌లో కలకలం రేపింది.గన్‌మెన్ చైతన్య ఇంట్లోనే తన వద్ద ఉన్న తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే చైతన్యను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం చైతన్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు ఆర్థిక సమస్యలే ఈ అఘాయిత్యానికి కారణంగా భావిస్తున్నారు.
0 Comments