భూదార్ కార్డులు సిద్ధం చేశామని స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అందజేస్తామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రెండో విడతలో 373 నక్షలేని గ్రామాల్లో సర్వే చేస్తామని, ఎన్నికల తర్వాత భూదార్ కార్డులు అందజేస్తామని తెలిపారు. రెండేళ్ల ప్రజా పాలనలో కేసీఆర్ హయాంలో తీసుకువచ్చిన ధరణిని బంగాళాఖాతంలో వేశామన్నారు. ప్రజలు మెచ్చే భూ భారతి చట్టాన్నితమ ప్రభుత్వంలో తీసుకువచ్చామని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద నక్షలేని ఐదు గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశామని వివరించారు. 6వేల మంది వీఆర్ఏలను నియమించామని తెలిపారు. 3490మంది సర్వేయర్లకు లైసెన్స్‌లు ఇచ్చామని చెప్పారు. ఒక్కో రెవెన్యూ గ్రామానికి సర్వేయర్లను అలాట్ చేశామని తెలిపారు. రోవర్స్ కొనుగోలు చేసి సర్వేయర్లకు అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా కుప్ప కూల్చారని, తమ ప్రభుత్వం సరిచేస్తున్నామని వివరించారు. 59 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను అధునాతనంగా నిర్మిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
0 Comments