ఉత్తరప్రదేశ్‌లోని బిదోలీ సమీపంలోగల దట్టమైన అడవుల్లో బవేరియా గ్యాంగ్ లీడర్ మిథున్ ఎన్‌కౌంటర్ అయ్యాడు. మిథున్ మొత్తం 20 కేసుల్లో వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడని, అతడి తలపై రూ.1.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. బవేరియా గ్యాంగ్ ఝింఝానా ప్రాంతంలో నేరపూరిత చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నదని పోలీసులకు సోమవారం సమాచారం అందింది. దాని ఆధారంగా పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఆ గ్యాంగ్ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాయి. పోలీసులు చుట్టుముట్టడంతో బవేరియా ముఠా సభ్యులు తప్పించుకునేందుకు విచరక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. దాంతో గ్యాంగ్‌స్టర్ మిథున్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కానీ అతడి అనుచరుడు ఒకరు తప్పించుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ గాయపడగా.. పోలీస్ ఇన్‌స్పెక్టర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
0 Comments