సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై గత అక్టోబర్‌లో షూ విసిరేందుకు ప్రయత్నించిన అడ్వకేట్ రాకేష్ కిషోర్‌పై మంగళవారంనాడు ఢిల్లీ కోర్టు ఆవరణలో దాడి జరిగింది. గవాయ్‌పై దాడి అనంతరం బార్ కాన్సిల్ ఆఫ్ ఇండియా అడ్వకేట్ కిషోర్‌ను సస్పెండ్ చేసింది. ఇందుకు సంబంధించి ఆయన కోర్టుకు వచ్చారు. ఆ విషయం తెలియడంతో కొందరు ఆయనపై చెప్పుతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అడ్వకేట్ కిషోర్‌పై దాడికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. అయితే ఈ ఘటనపై కిషోర్ స్పందిస్తూ 30 నుంచి 35 ఏళ్లు వయసున్న ఒక యువ అడ్వకేట్ తనపై చెప్పుతో దాడి జరిపినట్టు చెప్పారు. మాజీ సీజేఐపై దాడి చేసినందుకే తనను శిక్షించాలని అనుకున్నట్టు వారు చెప్పారన్నారు. కాగా, గత అక్టోబర్ 6న ఒక పిల్ విచారణ సందర్భంగా సీజేఐ గవాయ్ చేసిన కామెంట్లను వ్యతిరేకిస్తూ అడ్వకేట్ కిషోర్ ఆయనపై షూ విసిరారు. అయితే అది దూరంగా పడింది. తోటి లాయర్లను ఆయనను పట్టుకుని కోర్టు సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనకు అనంతరం అడ్వకేట్ కిషోర్‌పై చర్యకు జస్టిస్ గవాయ్ నిరాకరించారు. అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాత్రం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
0 Comments