పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీపై సీబీఐ క్రిమినల్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు సంబంధించిన భారీ బ్యాంకింగ్ మోసానికి ఆయనతో సహా అధికారులు కారణమయ్యారని ఆరోపణలు వచ్చాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన అధికారిక ఫిర్యాదు ఆధారంగా సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో జై అన్మోల్‌తో పాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, మాజీ సీఈఓ రవీంద్ర సుధాల్కర్ నిందితులుగా ఉన్నారు. ఫిర్యాదు ప్రకారం, కంపెనీ వ్యాపార కార్యకలాపాల కోసం యూనియన్ బ్యాంక్ రూ.450 కోట్ల వరకు రుణం మంజూరు చేసింది. అయితే, రుణ వాయిదాలను చెల్లించకపోవడంతో 2019 సెప్టెంబర్ నాటికి ఈ ఖాతా ఎన్‌పీఎగా మారింది. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన బ్యాంక్, ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టగా, కంపెనీ రుణంగా తీసుకున్న నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లించినట్లు గ్రాంట్ థార్న్‌టన్ నివేదికలో వెల్లడైంది.
0 Comments