తెలంగాణలోని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారంలో ఉన్న ఎంఎస్ స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మేడ్చల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే ఘటనాస్థలికి వెళ్లేందుకు కార్మికుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
0 Comments