ప్రముఖ కన్నడ దర్శకుడు సంగీత్ సాగర్ కన్నుమూశారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పాత్రధారి' ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. బుధవారం కొప్పలో షూటింగ్ జరుగుతుండగా సంగీత్ సాగర్ ఉన్నట్టుండి గుండె పోటుకు గురయ్యారు. ఇది గుర్తించిన సిబ్బంది వెంటనే ఆయన్ని కొప్ప ఆస్పత్రికి తరలించారు. సంగీత్ సాగర్ అరోగ్య పరిస్థితి విషమించటంతో అక్కడి వైద్యులు సివమొగ్గకు రిఫర్ చేశారు. కుటుంబసభ్యులు ఆయన్ని సివమొగ్గ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సాగర్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆయన్ని బతికించటానికి ఎంతో ప్రయత్నించారు. అయినా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ సంగీత్ సాగర్ కన్నుమూశారు. సాగర్ మృతితో కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన అకాల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సాగర్ కుటుంబానికి తమ సానుభూతి తెలియజేస్తున్నారు.
0 Comments