Ad Code

98వ ఆస్కార్‌ అవార్డుల రేసులో "హోమ్ బౌండ్" చిత్రం


మెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌, డాల్బీ థియేటర్‌లో 2026 మార్చి 15న 98వ ఆస్కార్‌ అవార్డుల వేడుక జరగనుంది. ఇందుకోసం పోటీ పడనున్న చిత్రాల జాబితాను 2026 జనవరి 22న ప్రకటించనున్నట్లు అకాడమీ వెల్లడించింది. 2025 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు విడుదలైన చిత్రాలు ఇందులో పోటీపడనున్నాయి.  98వ అకాడమీ అవార్డుల కోసం మొత్తం 12 విభాగాల్లో ఎంపికైన చిత్రాల జాబితాను అకాడమీ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఆస్కార్ బరిలోకి ఇండియా నుంచి పలు చిత్రాలు పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం, కుబేరా, పుష్ప 2, గాంధీతాత చెట్టు, కన్నప్ప లాంటి సినిమాలు ఆస్కార్ కోసం పోటీ పడి రేసు నుంచి తప్పుకున్నాయి. అయితే ఇప్పుడు ఇండియా నుంచి పోటీలో నిలిచిన చిత్రాల్లో "హోమ్ బౌండ్" మూవీ ఘనత సాధించింది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమాను షార్ట్‌లిస్ట్ చేసినట్లు అకాడమీ ప్రకటించింది. "హోమ్ బౌండ్" సినిమాకు నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ చిత్రం కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్లడానికి ప్రయత్నించే ఇద్దరు నిరుపేద ఉత్తర భారతీయ స్నేహితుల కథగా చెప్పొచ్చు. సామాజిక అసమానతలు, కుల వివక్ష, పేదరికం, ఆకస్మికంగా ఉద్యోగాలు కోల్పోవడం వల్ల కలిగే కష్టాలను ఇందులో చూపించారు. చందన్ (దళితుడు), షోయిబ్ (ముస్లిం) అనే ఇద్దరి నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్ ఫ్టిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిన చిత్రం 'మహావతార్ నరసింహ'. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. మహావిష్ణువు అవతారమైన నరసింహుని కథాంశంలో వచ్చిన ఈ యానిమేటెడ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఈ మూవీ యానిమేషన్ కేటగిరీలో ఆస్కార్ లో ఎంట్రీ సాధించినట్టు అకాడమీ వెల్లడించింది. 

Post a Comment

0 Comments

Close Menu