ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాల జాబితాను ట్రాన్స్ ప్రేరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో దక్షిణ సుడాన్ ఉండగా, 10వ స్థానంలో ఉత్తర కోరియా ఉంది. వివిధ దేశాల్లోని నిపుణులు, వ్యాపారుల అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉన్నదో అంచనా వేసి ఈ సంస్ధ వాటికి స్కోర్‌ను ఇస్తుంది. ఈ సంస్థ మొత్తం 180 దేశాల లిస్టు సిద్ధం చేయగా, అందులో అత్యంత అవినీతికి పాల్పడిన దేశాలకు సున్నా స్కోరు, అవినీతి లేని దేశాలకు 100 స్కోరు కేటాయిస్తుంది. ఈ జాబితా యుద్ధాలు, రాజకీయ అస్థిరత, బలహీన సంస్థల వల్ల ప్రభావితమైన దేశాలను ప్రతిబింబిస్తుంది. 2024లో ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశంగా దక్షిణ సూడాన్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, 9 పాయింట్లతో సోమాలియా రెండో స్థానంలో, వెనిజులా 10, సిరియా 12 పాయింట్లతో మూడు, నాగులు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ రిపోర్ట్ ప్రకారం భారత దేశం 180 దేశాల్లో 38 స్కోర్‌తో 96 స్థానంలో కొనసాగుతుంది. అయితే గత నివేదికలతో పోలిస్తే భారత్ స్కోరు కొద్దిగా తగ్గింది. 2023 నివేదికలో భారత్ 38 పాయింట్లు, 2022లో 40 పాయింట్లలో కొనసాగగా, 2024 రిపోర్టులో భారత్ స్కోరు 38గా నమోదైంది.
0 Comments