టాస్క్ ఫోర్స్ లో ఒకేసారి 80 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ర్యాంక్ అధికారులను అటాచ్ చేశారు. టాస్క్‌ఫోర్స్ ప్రకాళనకే నిర్ణయం తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. కాగా, కొన్నేళ్లుగా టాస్క్‌ఫోర్స్‌లో అధికారులు పాతుకుపోయారు. ఇటీవల కాలంలో టాస్క్ ఫోర్స్ అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఒక నిందితుడ్ని తప్పించినందుకు భారీగా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
0 Comments