Ad Code

కాళేశ్వరం నుంచి ఐదేళ్లలో 80 -90 టీఎంసీల నీళ్లను మాత్రమే ఉపయోగించారు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి


తెలంగాణ సచివాలయంలో మీడియా చిట్ చాట్‌లో  నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ నాయకులు సిగ్గుతో తలవంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల తలలను తాకట్టు పెట్టి కాళేశ్వరం కట్టారన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ అని, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని, కాళేశ్వరం నుంచి ఐదేళ్లలో 80 -90 టీఎంసీల నీళ్లను మాత్రమే ఉపయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు అతి తెలివి తేటలు ప్రదర్శించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారని, కృష్ణా జలాల విషయంలో 2014 నుంచి 2020 వరకు ఆపేక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ ఆంధ్రకు 512 టీఎంసీలు, తెలంగాణ కు 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలోని పాలమూరు, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను కేసీఆర్ ఎందుకు పూర్తి చెయ్యలేదని ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ రావు బరితెగించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ అప్పులు తీర్చడానికి ఏడాదికి 16 నుంచి 20 వేల కోట్ల రూపాయలు కడుతున్నామన్నారు. గతంలో వాళ్ళు చేసిన 45 టీఎంసీ మైనర్ ఇరిగేషన్, గోదావరి డివెర్షన్ సేవింగ్ 45 టీఎంసీల నిర్ణయం ప్రకారమే లేఖ రాశాం. లేఖ కొత్తది కాదు. గత బీఆర్ఎస్ ఒప్పందాన్నే మేము లేఖను రాశామని పేర్కొన్నారు. 2020 కేఆర్ఎంబి సమావేశంలో కేసీఆర్ 34 శాతం నీటికి ఒప్పుకుంటే మేము 71 శాతం కావాలని లేఖ రాశామని వెల్లడిచారు. పాలమూరుకు ఇప్పటికీ పూర్తిగా పర్యావరణం అనుమతులు రాలేదన్నారు. పదేళ్ల పాటు పాలమూరు పూర్తి చేయకుండా అక్కడి ప్రజలను మోసం చేసింది కేసీఆరేనని, 90 శాతం పనులు పూర్తి అయితే ఒక్క ఎకరాకు నీళ్లు ఎందుకు ఇయ్యలేదని ప్రశ్నించారు.

Post a Comment

0 Comments

Close Menu