తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తైంది. దీనికి అక్కడి రాష్ట్రప్రభుత్వాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఏకంగా ముఖ్యమంత్రులు, అగ్రనేతలే రోడ్లపైకి వచ్చి ర్యాలీలు, ఆందోళనలకు దిగారు. ఆందోళనల మధ్యనే ఈ సర్ ప్రక్రియ ముగిసింది. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారులు ఒత్తిడికి గురైయ్యారు. డూప్లికేట్ ఓట్లను, మరణించిన వారి ఓట్లను ఈ ప్రక్రియ ద్వారా తొలగిస్తున్నారు. దీని కోసం తెలంగాణలో ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయనున్నట్లు తెలిసింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం మూడో విడత కింద ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్) చేపట్టేందుకు ఈ నెలాఖరులోగా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకటించాక ఆ ప్రక్రియలో భాగమయ్యే అధికారుల బదిలీలపై ఆంక్షలు అమల్లోకి రానుండటంతో ఆలోగా పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోపాటు కొన్ని శాఖల కార్యదర్శులను ప్రభుత్వం బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో 2025 సెప్టెంబర్ నాటికి సుమారు 3.35 కోట్ల ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు 1.68 కోట్లు, పురుష ఓటర్లు 1.66 కోట్లు కాగా.. థర్డ్ జెండర్ 2,829 మంది. తెలంగాణలో కూడా దాదాపు ప్రస్తుతం ఉన్న ఓటర్లలో 50 లక్షలకు పైగా ఓట్లు ఎగిరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రులు, అగ్రనేతలే ఆందోళనలు చేపట్టారు.
0 Comments