Ad Code

తత్కాల్ టికెట్ల జారీ విషయంలో తాజా మార్పులు : 3.02 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్


త్కాల్ టికెట్ల జారీ విషయంలో నకిలీలకు చెక్ పెట్టి ప్రయాణీకులకు వెసులుబాటు కలిగించేలా  రైల్వే శాఖ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆధార్ ఆధారిత OTP ధృవీకరణను తీసుకొచ్చింది. తత్కాల్ టికెట్ల విషయంలో ప్రయాణీకులకు మెరుగైన విధానం అమల్లోకి తెస్తున్నట్లు రైల్వే మంత్రి  అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. సేవల విషయంలో అవసరమైన మార్పులు చేస్తున్నామని చెప్పారు. తాజాగా తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రయాణీకుల నుంచి మద్దతు లభిస్తుందని వివరించారు. తత్కాల్ టికెట్ల విషయంలో వస్తున్న ఫిర్యాదులు, సూచనలకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా ఐఆర్సీటీసీ ఖాతాల ఏరివేతనూ అదే స్థాయిలో చేపట్టినట్లు వివరించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 3.02 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసినట్లు రైల్వే అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. AKAMAI వంటి యాప్ బాట్ టెక్నాలజీని వినియోగించి నకిలీ, ఆటోమేటెడ్ ప్రయత్నాలను అడ్డుకున్నట్లు మంత్రి వెల్లడించారు. సామాన్యులకు సాధారణ, తత్కాల్ టికెట్లు అందేలా రిజర్వేషన్ వ్యవస్థ తీర్చి దిద్దేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. తత్కాల్ వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఆధార్ బేస్డ్ ఓటీపీ వ్యవస్థను దశల వారీగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం 322 రైళ్లకు దీనిని వర్తింప చేసామని ఆయన చెప్పారు. దీని ద్వారా ఆయా రైళ్లల్లో తత్కాల్ టికెట్ల సమయం దాదాపు 65 శాతం మేర పెరిగిందన్నారు. అదే విధంగా రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తత్కాల్ బుకింగ్స్ కు ఓటీపీ వెరిఫికేషన్ విధానాన్ని డిసెంబర్ 4వ తేదీ వరకు 211 రైళ్లకు వర్తింప చేసినట్లు వివరించారు. దీని కారణంగా 96 పాపులర్ రైళ్ల టికెట్ల అందుబాటు సమయం 95 శాతం మేర పెరిగిందని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. తత్కాల్ టికెటింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేసేవారిపై ప్రభుత్వం గట్టి నిఘా ఉంచిందని చెప్పారు. దశల వారీగా మరి కొన్ని మార్పులకు టికెట్ల జారీ వ్యవస్థలో తీసుకురానున్నట్లు ప్రకటించారు.

Post a Comment

0 Comments

Close Menu