తమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ కార్డుదారులకు రూ.3,000 నగదుతో పాటు పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్ అందించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ జనవరి రెండో వారంలో ఈ పంపిణీని ప్రారంభిస్తారు. జనవరి తొలి వారంలో టోకెన్ల పంపిణీ జరుగుతుంది. గిఫ్ట్ హ్యాంపర్‌లో ముడి బియ్యం, చక్కెర, చెరుకు, ధోతీ, చీర, జీడిపప్పు, ఎండుద్రాక్ష, యాలకులు ఉంటాయి. గత ఏడాది కేవలం గిఫ్ట్ హ్యాంపర్ మాత్రమే అందించగా, ఈసారి నగదు సహాయంతో ప్రభుత్వ సాయం గణనీయంగా పెరిగింది.
0 Comments