వెండి ధర ఇటీవల తగ్గినట్లే తగ్గి మళ్లీ రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఫలితంగా సరికొత్త రికార్డును నమోదు చేస్తూ కిలో వెండి రూ.2లక్షలు దాటేసింది. అలాగే బంగారం ధర కూడా పెరిగింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం 24 క్యారట్ల బంగారం 10గ్రాములపై రూ. 870 పెరగ్గా 22 క్యారట్ల బంగారంపై రూ. 800 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్‌పై ఏకంగా 18డాలర్లు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,206 డాలర్ల వద్ద కొనసాగుతోంది. కిలో వెండిపై ఇవాళ ఏకంగా రూ.8 వేలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.2లక్షలు దాటేసింది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈనెల చివరి నాటికి వెండి రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
0 Comments