ఆసియా క్రికెట్ మండలి మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 దుబాయ్‌లో ఐసీసీ అకాడమీ వేదికగా భారత్- యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ 234 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం ఆరు వికెట్లు నష్టపోయి 433 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 95 బంతుల్లో 171 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, 14 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక వన్‌డౌన్ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (69), ఆ తర్వాతి స్థానంలో వచ్చిన విహాన్ మల్హోత్రా (69) అర్ధ శతకాలతో సత్తా చాటగా వేదాంత్ త్రివేది (38) రాణించాడు. యూఏఈ బౌలర్లలో యుగ్ శర్మ, ఉద్దిశ్ సూరి చెరో రెండు వికెట్లు తీయగా, షాలోమ్ డిసౌజా, కెప్టెన్ యాయిన్ రాయ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. భారత్ విధించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు కెప్టెన్ యాయిన్ రాయ్ (17), షాలోమ్ డిసౌజా (4) వన్‌డౌన్ బ్యాటర్ అయాన్ మిస్బా (3) విఫలమయ్యారు. నాలుగో స్థానంలో ఆడిన ముహమూద్ రేయాన్ ఖాన్ (19) కూడా నిరాశపరిచగా.. అహ్మద్ హుదాదాద్ డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ రెండు వికెట్లు తీయగా.. కిషన్ కుమార్ సింగ్, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్, విహాన్ మల్హోత్రా తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. భారత్ తదుపరి డిసెంబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది.
0 Comments