ధర్మశాలలో ఆదివారం జరిగిన మూడో టీ20లో బౌలర్లు రాణించడంతో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సిరీస్ లో 2-1తో ముందంజ వేసింది. నాలుగో టీ20 బుధవారం లఖ్‌నవూలో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మార్‌క్రమ్ (46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61) అర్ధసెంచరీ సాధించగా.. ఫెరీరా (20), నోకియా (12) రెండంకెల స్కోర్లు సాధించిన మరో ఇద్దరు ఆటగాళ్లు. ఆ తర్వాత ఛేదనలో భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 120 పరుగులు చేసి నెగ్గింది. అభిషేక్ (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35), గిల్ (28), తిలక్ (25 నాటౌట్) రాణించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా అర్ష్‌దీప్ (2/13) నిలిచాడు. మరోవైపు పేసర్ బుమ్రా వ్యక్తిగత కారణాలరీత్యా ముంబైకి వెళ్లగా, స్పిన్నర్ అక్షర్ అనారోగ్యంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. వీరి స్థానాల్లో హర్షిత్, కుల్దీప్ భారత జట్టులోకి వచ్చారు.
0 Comments