Ad Code

హైదరాబాద్ డాక్టర్ ను బురిడీ కొట్టించి రూ.14 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు


హైదరాబాద్ కు చెందిన డాక్టర్ నుంచి రూ.14 కోట్లు సైబర్ కేటుగాళ్లు కొట్టేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో సదరు వైద్యుడిని బురిడీ కొట్టించారు. తొలుత ఫేస్ బుక్ ద్వారా అందమైన అమ్మాయి ఫొటోలతో డాక్టర్‌కు మెసేజ్ చేశారు. ఫేస్ బుక్ ద్వారా సదరు లేడీ.. తాను ఒక ఒంటరి మహిళలని కంపెనీలో పని చేస్తానని పరిచయం చేసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు స్టాక్ మార్కెట్లో ద్వారా తమ కంపెనీలో పెట్టుబుడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. ఆ మహిళ మాటలు నమ్మిన వైద్యుడు.. తన ఇల్లును అమ్మి రూ.14 కోట్లు స్టాక్ మార్కెట్లో పెట్టాడు. ఆ తర్వాత మహిళ నుంచి స్పందన రాకపోవడంతో తాను మోసపోయినట్లు వైద్యుడు తెలుసుకున్నాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు డాక్టర్‌ ను కాంబోడియా నుంచి ట్రాప్ చేసి మోసం చేసినట్లు గుర్తించారు. కాంబోడియాలో తిష్ట వేసిన చైనీయులే ఈ వ్యవహారం వెనకాల ఉన్నారని, ఇండియా నుంచి ఉద్యోగాల పేరుతో యువకుల్ని తీసుకువెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని ఏసీపీ ప్రసాద్ తెలిపారు. కాంబోడియాలో ఉన్న సైబర్ నేరగాలకు mule అకౌంట్స్ అందించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. mule అకౌంట్ లోకి వచ్చిన డబ్బుల్ని వివిధ మార్గాల ద్వారా కాంబోడియాకి తరలించినట్లు పోలీసులు గుర్తించారు.

Post a Comment

0 Comments

Close Menu