Ad Code

మినీ జెట్ కుప్పకూలి 10 మంది మృతి !


మెక్సికోలోని టోలుకా విమానాశ్రయ సమీపంలో ఓ విమానం ప్రమాదానికి గురైంది. మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయలుదేరిన ఓ మినీ జెట్ కుప్పకూలినట్లు తెలుస్తోంది. అత్యవసర లాండింగ్ కు ప్రయత్నించిన ఆ మినీ జెట్ కుప్పకూలిందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో ఇద్దరు సిబ్బందితో పాటు ప్రయాణికులు మరణించినట్లు నేషనల్ మీడియాలో ఒక కథనాలు వస్తున్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమీపంలోనే ఓ ఫుట్ బాల్ స్టేడియం ఉంది. ఆ స్టేడియంలోనే అత్యవసర ల్యాండింగ్ కు పైలెట్ ప్రయత్నించాడు. కానీ పరిస్థితి అదుపు తప్పడంతో అక్కడే ఉన్న ఓ కంపెనీ పైకప్పు పై ఆ మినీ జెట్ పడి పేలిపోయింది. ఈ సంఘటన జరిగిన వెంటనే అలర్ట్ అయిన అధికారులు, సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu