Ad Code

ఆస్ట్రేలియా బాండి బీచ్‌లో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఆగంతకులు : 10 మంది మృతి, పలువురికి గాయాలు


స్రేలియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బాండి బీచ్‌లో తుపాకీ కాల్పులు జరిగాయి. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కాల్పుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్‌లోకి ప్రవేశించిన ఇద్దరు ఆగంతకులు ఒక్కసారిగా ఫైరింగ్‌ మొదలుపెట్టడంతో వందల మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం నల్లటి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు షాట్‌గన్స్‌తో సర్ఫ్‌ క్లబ్‌ పక్కనే ఉన్న పాదచారుల వంతెనపైకి చేరుకొని కాల్పులు జరిపారు. అక్కడ జరుగుతున్న ఒక ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు ఆస్ట్రేలియా పత్రికలు పేర్కొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు దుండగులను అదుపులోకి తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో క్షతగాత్రులను కాపాడేందుకు హెలికాప్టర్లు, 30 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకొన్నాయి. కాగా, బాండి బీచ్‌లో యూదులు జరుపుకొంటున్న హనుక్కా వేడకలను దుండగులు లక్ష్యంగా చేసుకొన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్థానిక యూదులు హాజరయ్యారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదిలావుంటే, బీచ్‌లోకి చొరబడిన దుండగులు విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్న వేళ ఓ స్థానికుడు వారిని అడ్డుకున్నాడు. ఓ సాయుధుడిని వెనుక నుంచి వెళ్లి బలంగా పట్టుకొని అతడి చేతిలో గన్‌ను లాగేసుకొన్నాడు. ఆ తర్వాత చేతికందిన వాటితో అతడిని తరిమికొట్టాడు. దీంతో అతడితో ఉన్న మరో దుండగుడు కూడా వెనక్కి తగ్గాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. 

Post a Comment

0 Comments

Close Menu