Ad Code

ప్రకాశ్ పుర్బ్ వేడుకల్లో మిస్ అయిన యువతి పాకిస్థానీతో వివాహం?


సిక్కుల మత గురువు గురునానక్ జయంతి సందర్భంగా ప్రకాశ్ పుర్బ్ వేడుకల్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ వెళ్లి కనిపించకుండా పోయిన యాత్రికురాలు సర్పిజిత్ విషయంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చాయి. సర్బిజిత్ పాకిస్థాన్ లాహోర్ సమీపంలోని షేక్ పూరకు చెందిన నాసిర్ హుస్సేన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందని, అంతేకాకుండా పెళ్లికి ముందే ఇస్లాం మతంలోకి చేరి తన పేరు నూర్ గా మార్చుకుందని నికానామాలో బయటపడింది. అయితే ఈవిషయాన్ని ఇంకా అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు. సర్పిజిత్ కౌర్ తన భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. పంజాబ్, కపుర్తా జిల్లాలోని అమానిపూర్ గ్రామానికి చెందిన సర్బిజిత్ కౌర్, గురునానక్ 556 జయంతి సందర్భంగా నిర్వహించే ప్రకాశ్ పుర్బ్ వేడుకల్లో పాల్గొనేందుకు నవంబర్ 4న పాకిస్థాన్ వెళ్లారు. 10 రోజుల పాటు యాత్ర జరిగిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఆమె భారత్ రాలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ప్రస్తుతం ఆమె ఇస్లాంలోకి మారి వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. 

Post a Comment

0 Comments

Close Menu