ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో రాత్రి సమయంలో రోడ్డుపై వెళ్తున్న కారులో ఓ మహిళ అందరికీ షాక్ ఇచ్చింది. ఆ మహిళ నగ్నంగా కనిపించింది. కారు విండో నుంచి బయటికి వంగి మరీ అసభ్యకరంగా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ కారు వెనకనుంచే వెళ్తున్న మరో కారు డ్యాష్ బోర్డ్ కెమెరాలో ఈ వీడియో రికార్డు అయింది. ఈ వీడియోపై నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను యూపీ ఖబర్ అనే వ్యక్తి ఇన్ స్టా లో పోస్టు చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. లక్నో లో ఇలాంటి ఘటనలు ఈ మధ్య మరింతగా పెరిగిపోయాయని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. అమ్మాయి అయి ఉండి నడిరోడ్డుపై ఇలాంటి ఘటనలకు పాల్పడడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments