గుజరాత్‌లోని బాలచాడి సైనిక స్కూల్‌లో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. బలవంతంగా శిక్షించడంతోపాటు కర్రతో వారిని కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక సీనియర్ విద్యార్థి టవల్‌లో ఉన్నాడు. జూనియర్ స్టూడెంట్స్‌ను అతడు వేధించాడు. పుష్ అప్‌లు తీయమని బలవంతం చేశాడు. ఆ పొజిషన్‌లో ఉన్న వారిని వరుసగా కర్రతో కొట్టాడు. దీంతో కొందరు జూనియర్లు బాధతో అల్లాడిపోయారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సైనిక స్కూల్‌లో ర్యాగింగ్ జరుగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం స్పందించింది. ఈ సంఘటనపై అంతర్గతంగా దర్యాప్తు చేస్తున్నది.
0 Comments