రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనున్న ఓ అమెరికన్ వ్యాపారవేత్త కుమారుడి వివాహానికి డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. నవంబర్ 21, 22 తేదీల్లో జరిగే ఈ వివాహానికి ఆయనతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో, అమెరికా సీక్రెట్ సర్వీసెస్ బృందం ఉదయ్‌పూర్‌కు చేరుకొని ఏర్పాట్లను సమీక్షిస్తోంది. నగర పోలీసులు విమానాశ్రయం నుంచి ప్యాలెస్ వరకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
0 Comments