తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన వారు కారులో గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి వస్తున్న క్రమంలోనే బీదర్ జిల్లా హల్లిఖేడ్ వద్ద వారి కారును ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సంఘటనా స్థలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
0 Comments