Ad Code

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఏటీసీ వ్యవస్థలో సాంకేతిక లోపం : విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం


న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ (ఏటీసీ) వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 350 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముందుగా షెడ్యూల్ చేసిన పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దీని ప్రభావం ఉత్తరాది ఎయిర్ పోర్టులపైన పడింది. అయితే ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని రన్ వేపై విమానాలు పార్కింగ్ చేసేందుకు సరిపడినంత స్థలం లేనందున పలు సర్వీసులు రద్దు చేసినట్లు ఎయిర్ పోర్ట్ వర్గాలు వివరించాయి. గురువారం సాయంత్రం నుంచే ఏటీసీలో ఈ సమస్య ఉత్పన్నమైందని వెల్లడించాయి. ఇక అందుబాటులో ఉన్న డేటా అధారంగా పలు విమానాల సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపింది. ఆ క్రమంలో చాలా ఆలస్యంగా విమాన సర్వీసుల నడుస్తున్నాయంది. మరోవైపు ముంబై ఎయిర్‌పోర్ట్‌లోనూ ఏటీసీ వ్యవస్థ కుప్పకూలింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రతి రోజు 1,500 విమానాలు రాక పోకలు సాగిస్తాయి. ట్రాకింగ్ వెబ్ సైట్‌లో విమాన సర్వీసు బయలుదేరు సమయం దాదాపు 60 నిమిషాలు ఆలస్యం చూపిస్తోంది. ఈ సాంకేతిక లోపాన్ని పరిష్కరించేందుకు ఎయిర్ పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియాతో కలిసి పని చేస్తున్నట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ప్రతినిధి వెల్లడించారు. 

Post a Comment

0 Comments

Close Menu