Ad Code

చలికాలం - వాకింగ్, రన్నింగ్ - జాగ్రత్తలు


లికాలంలో ఉదయం పూట స్వచ్ఛమైన గాలిలో నడవడం లేదా పరిగెత్తడం మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చి, ఒత్తిడిని తగ్గిస్తుంది. చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, ఈ మంచి అలవాటు ప్రయోజనాలకు బదులు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది. వాకింగ్, రన్నింగ్ సాధారణంగా రక్త ప్రసరణను మెరుగుపరిచి, నిద్ర నాణ్యతను పెంచుతాయి. అయితే చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే, కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చలి వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనితో కండరాలు బిగుసుకుపోతాయి. దీంతో నొప్పి, తిమ్మిర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చల్లటి గాలి, వాయు కాలుష్యం కలవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. శ్వాసకోశ వ్యాధులు లేదా అలర్జీలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. జలుబు లేదా జ్వరం ఉన్న సమయంలో బయటికి వెళితే, చల్లటి గాలి వల్ల ఆ లక్షణాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. చలిలో వ్యాయామం చేయడానికి శరీరం సిద్ధంగా ఉండాలి. బయటికి వెళ్లే ముందు తేలికపాటి, వెచ్చని బట్టలు ధరించడం మర్చిపోవద్దు. చల్లటి గాలి తగలకుండా చెవులు, తల, చేతులను పూర్తిగా కప్పుకోవాలి. చలి లేదా పొగమంచు చాలా ఎక్కువగా ఉంటే, సూర్యుడు వచ్చిన తర్వాత మాత్రమే వాకింగ్ లేదా రన్నింగ్ ప్రారంభించడం మంచిది. కాలుష్యం నుంచి శ్వాసకోశాన్ని కాపాడుకోవడానికి మాస్క్ ధరించడం మంచిది. జలుబు, జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఇంటిలోనే డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే బయటికి వెళ్లాలి. వాకింగ్ లేదా రన్నింగ్ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత, బట్టలు మార్చుకునే ముందు శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు 5 నుంచి 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. 

Post a Comment

0 Comments

Close Menu