Ad Code

సర్వేలపై తేజస్వి యాదవ్ ధ్వజం!


హాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల ఒత్తిడితో ఈ సర్వేలు వచ్చాయన్నారు. 'SIR' సమయంలో గోడి మీడియా బీహార్‌లోకి ప్రవేశించి చేసిన సర్వేగా పేర్కొన్నారు. నవంబర్ 14న ఫలితాలు మహాఘట్‌బంధన్‌కు అనుకూలంగా వస్తాయని, నవంబర్ 18న ప్రమాణస్వీకారం ఉంటుందని తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. రాత్రి 7 గంటలకు పోలింగ్ ముగిస్తే, అంతకుముందే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయని, ఓటింగ్ ముగియకుండానే సర్వేలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మాకు అందుతున్న సమాచారం మేరకు ఫలితాలు మహాఘట్‌బంధన్‌కు సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. 1995 ఎన్నికల కంటే మెరుగ్గా ఫలితాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీహారీయులంతా అధికార కూటమిపై విసుగుపోయారని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. కచ్చితంగా రాష్ట్రంలో మార్పు రాబోతోందని, దీంట్లో ఎలాంటి అనుమానాలు లేవని తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు.


Post a Comment

0 Comments

Close Menu