Ad Code

చలి కాలం - చర్మం పొడిబారకుండా జాగ్రత్తలు


చలి కాలంలో మన చర్మం పొడిబారిపోతుంది. దీంతో చర్మంపై పొలుసులు లేస్తుంటాయి. చేతులు, కాళ్లపై ఎక్కువగా పొలుసుగా వచ్చి పుండ్లు కూడా పడే అవకాశం ఉంటుంది. శీతాకాలంలో ఒత్తిడికి గురయ్యే చర్మానికి వెచ్చని ఆలివ్ నూనెను ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా స్నానాన్ని 5-10 నిమిషాల మధ్యలోనే కంప్లీట్ చేయాలని సూచిస్తున్నారు. చర్మం పొడిబారకుండా లోషన్లకు బదులుగా సువాసన లేని క్రీములను వాడాలని చర్మ నిపుణలు వెల్లడించారు. చర్మం తడిగా ఉన్నప్పుడు స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ వేయాలి. కఠినమైన సబ్బులను వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఎక్స్‌ఫోలియేట్ చేయాలని.. ఇంటి లోపల హ్యూమిడిఫైయర్ వాడాలని చెబుతున్నారు. బయటకు వెళ్లేటపుడు చేతులకు గ్లౌస్ లాంటివి వేసుకుని వెళ్లాలని, సువాసన లేని లాండ్రీ డిటర్జెంట్లను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu